పంచాయతీ ఎన్నికల ఫలితాలతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడాతారు. తొలి విడత ఎన్నికల్లో తమ పార్టీ 38 శాతం సీట్లను గెలుచుకుందని, మొత్తం 2,723 స్థానాల్లో తమ పార్టీ 1055 స్థానాలను గెలుచుకుందని ఆయన అన్నారు.
ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు లెక్కల చెబుతుందన్నారు. 90 శాతం సీట్లు గెలుచుకుంటామని గాలి కబుర్లు చెప్పిన వైసీపీ ఇప్పుడు అబద్ధాలు చెబుతోందన్నారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు అధికార పార్టీపై ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడారని, టీడీపీని గెలిపించారని అన్నారు.
తమ నాయకులపై అధికార పార్టీ అక్రమ కేసులు పెట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా 174 అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. జగన్ స్వంత కుటుంబసభ్యులకే వెన్నుపోటు పొడిచారని, జగన్ బాణం అని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. షర్మిల పార్టీ పెడుతున్నట్లు చెప్పినా విజయసాయిరెడ్డి పెట్టడం లేదని గాలి మాటలు చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.