రాజకీయం (Politics)

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఖ‌రారు.. ఎమ్మెల్సీ రేసులో వీరే..!

తెలంగాణ‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రెండు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వర్గాల ఎమ్మెల్సీ స్థానాల‌కు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. న‌ల్గొండ – వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయ‌క్‌, హైద‌రాబాద్ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – రంగారెడ్డి స్థానం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్థులుగా పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కాగా, వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అన్ని పార్టీల అభ్య‌ర్థుల‌పై స్ప‌ష్ట‌త వ‌స్తోంది. న‌ల్గొండ – వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం స్థానానికి టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. బీజేపీ నుంచి ప్రేమేంద‌ర్ రెడ్డి, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్ర‌మ‌, క‌మ్యూనిస్టుల త‌ర‌పున జ‌య‌సార‌థి రెడ్డి, తెలంగాణ జ‌న స‌మితి నుంచి ప్రొ.కోదండ‌రాం పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా తీన్మార్ మ‌ల్ల‌న్న‌, చెరుకు సుధాక‌ర్ పోటీ చేస్తున్నారు.

హైద‌రాబాద్ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – రంగారెడ్డి స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌రావు, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, క‌మ్యూనిస్టుల మ‌ద్ద‌తుతో ఇండిపెండెంట్‌గా ప్రొ.నాగేశ్వ‌ర్ పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి ఇంకా ఖ‌రారు కాలేదు. హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పోటీ చేసే అవ‌కాశం ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.