కరోనా ను అడ్డుకునేందుకు నిపుణులు రెండు మాస్క్ ల ఫార్ములా ను కనిపెట్టడం జరిగింది.బహిరంగ ప్రదేశాలలో ఎక్కువగా తిరగవలసి అవసరం ఉన్నవారు, ఆరోగ్యరీత్యా బలహీనులుగా ఉండి త్వరగా అస్వస్థత బారిన పడే ప్రమాదం ఉన్నవారు,ఎక్కువ ప్రయాణాలు చేయాలిసిన అవసరం ఉండేవారు అదనపు సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారు రెండు, అంతకంటే ఎక్కువ పొరలు ఉండే మాస్కు వాడవచ్చని హామర్ చెబుతున్నారు.
కరోనా మహమ్మారి వెలుగు చూసిన తరువాత ప్రజల జీవనశైలి చాలావరకు మారిపోయింది.తరచుగా చేతులను సబ్బుతో కడుక్కోవడం, బయటకు వెళ్లినప్పుడు ప్రతిసారి మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు ఇప్పటికీ పాటిస్తునే ఉన్నారు. ఇవన్నీ కరోనా వైరస్ సోకకుండా నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మాస్కులు వైరస్‌ను ఎంత సమర్థంగా అడ్డుకోగలవనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో కొంతమంది రెండు మాస్కులు ధరించడం వల్ల వైరస్ సంక్రమణ రేటు తగ్గుతుందని చెబుతున్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పొరలతో తయారు చేసిన క్లాత్ మాస్కును వాడటం మంచిదని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ కూడా సూచిస్తోంది. ఈ మాస్కులు ముక్కు, నోటిని పూర్తిగా కవర్ చేసేలా ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలవని నిపుణులు చెబుతున్నారు.