న్యూ ఢిల్లీ:భారత్ లో ఈరోజు కరోనా కేసులు కాస్త పెరిగాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 11,067 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,58,371 కు చేరింది.ఇందులో 1,05,61,608  మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,41,511 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 94 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,55,252 కి చేరింది.