కేరళ : 192 మంది బడిపిల్లలకు కరోనా కేరళలో పాఠశాల విద్యార్థులకు కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది . మలప్పురంలోని ఓ రెండు పాఠశాలలకు చెందిన 192 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . వీరిలో 149 మంది ఒకే పాఠశాలకు చెందిన వారు కాగా .. 91 మంది విద్యార్థులు ఒకే ట్యూషన్ సెంటర్‌కు వెళ్తున్న వారిగా గుర్తించారు . మరోవైపు 72 మంది టీచర్లు కూడా కొవిడ్ పాజిటివ్ గా తేలారు . దీంతో రెండు పాఠశాలలను మూసివేశారు అధికారులు .