వార్తలు (News)

ఉత్తరాఖండ్ జలప్రళయం: అక్కడి పరిస్థితి వారి మాటల్లోనే..

నందాదేవి గ్లేసియర్‌లో మంచు చరియలు విరిగిపడటంతో జల ప్రళయం సంభవించిన సంగతి సొరంగంలో ఉన్న వారెవరికీ తెలియదు. అయితే, వీరున్న సొరంగంలోకి ఒక్కసారిగా బురద, శిథిలాలు, వరద నీరు దూసుకొచ్చాయి.దీంతో తపోవన్ విష్ణుగాడ్ జలవిద్యుత్ కేంద్రంతో అనుసంధానమై ఉండే రెండు సొరంగాలూ మూసుకుపోయాయి. దాని కారణంగా సొరంగంలో ఆదివారం ఏడు గంటలపాటు బసంత్ బహాదుర్‌తో పాటు 12 మంది చిక్కుకుపోయారు. సొరంగానికి పైన ఉండే ఇనుప చువ్వలకు వేళాడుతూ కొంతమంది ఉండగా జేసీబీపై కూర్చొని మరికొందరు సాయం కోసం ఎదురు చూశారు.
బసంత్‌, ఆయనతోపాటు ఉన్న అందరినీ చిన్న సొరంగం నుంచి సహాయ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.

ఆ ఏడు గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం, అంతటి భయానక పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.వరద నీటితో 3.8 కిలో మీటర్ల పొడవైన ఈ చిన్న సొరంగం మూసుకుపోయినప్పుడు.. బహాదుర్‌తోపాటు 12 మంది 300 మీటర్ల లోపల ఉండిపోయారు.

గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో భారీ విస్ఫోటం సంభవించడం వల్ల సొరంగం మూసుకుపోయిందేమోనని మొదట వీరు భావించారు. సొరంగం బయట నుండి భారీగా శబ్దాలు రావడం తో కాసేపు వీరి చెవులు పని చేయలేదు. ఒకవేళ సొరంగం నుంచి బయటకు వస్తే, విద్యుత్ షాక్‌తో చనిపోతామని భయంతో అక్కడే ఆగిపోయారు.
”అంధకారం అలముకున్న సొరంగంలోకి ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం దూసుకువచ్చింది. ”ఒక్కసారిగా మేం జేసీబీ వైపు పరుగెత్తాం. దానిపైకి ఎక్కి, అలానే ఉండిపోయాం. కిందంతా చల్లని నీరు పారుతూ ఉంది. నా జీవితంలో ఇలాంటి దుర్భరమైన ఏడు గంటలను నేను ముందెన్నడూ చూడలేదు. కానీ మేం బయటపడతామనే ఆశ కోల్పోకుండా మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం” అని బహదూర్ చెప్పారు.

నీరు ముంచెత్తిన సమయంలో, అదృష్టవశాత్తు బహాదుర్ దగ్గర ఫోన్ ఉంది.
అయితే, సొరంగంలో మొబైల్ సిగ్నల్స్ సరిగా లేవు. చివరకు, ఎలాగోలా వారు సహాయక బృందాలకు సమాచారం అందించారు. దీంతో తాళ్ల సాయంతో అందరినీ సురక్షితంగా కాపాడగలిగారు.

సహాయక సిబ్బంది కాపాడినవారిలో వీరేంద్ర కుమార్ గౌతమ్ కూడా ఉన్నారు.సొరంగం నుంచి ఆయన్ను సహాయక సిబ్బంది బయటకు తీసుకొచ్చిన తర్వాత, సంతోషంతో ఆయన చేతులు ఊపుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.

ప్రాణాలతో బయటపడిన వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు.సొరంగంలో 350 మీటర్ల దూరంలో ఆయన పనిచేస్తున్నారు .

అకస్మాత్తుగా ఒక కార్మికుడు పక్కనున్న నదిలో నీరు ఉప్పొంగుతోందని, అందరూ బయటకు వచ్చేయాలని ఓ కార్మికుడు గట్టిగా అరిచాడు. కానీ బయటకు వచ్చేందుకు అక్కడ పని చేస్తున్న సిబ్బందికి సమయం దొరకలేదు.

”నీరు వేగంగా సొరంగంలోకి మాపైపుగా దూసుకొచ్చింది. వెంటనే సొరంగం పైకప్పుకు అమర్చిన ఇనుప రాడ్లను పట్టుకుని వేళాడాం. నీటి ప్రవాహం తగ్గేంత వరకు మేం రాడ్లను పట్టుకొని అలానే ఉన్నాం”అని శ్రీనివాస్ తెలిపారు.

ఇనుప రాడ్లను పట్టుకొని వేళాడుతూ వీరు ప్రాణాలను నిలబెట్టుకున్నారు. కొంతసేపటి తర్వాత నీటి ప్రవాహం ఉద్ధృతి తగ్గడాన్ని వీరు గమనించారు. దీంతో సొరంగం ద్వారం వైపుగా నడిచారు.అయితే, అక్కడ అంతా అంధకారంగా ఉంది. ఎందుకంటే నీటి ప్రవాహంతో సొరంగ మార్గంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు లోపల చిక్కుకున్న కొందరికి శ్వాస కూడా సరిగా ఆడలేదు.

మేం గడ్డకట్టే నీటిలో చిక్కుకుపోవడం వల్ల మా పాదాలు కూడా గడ్డకట్టేస్తున్నట్లు అనిపించింది. మా బూట్లన్నీ బురద, మట్టితో నిండిపోయాయి. కాళ్లు కూడా వాచిపోయాయి”అని , ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు చీకట్లో తాము పాటలు పాడుకునే వాళ్లమని ,”నేను పాటలు పాడేవాణ్ని. అందరూ ధైర్యంగా ఉండేందుకు కవితలు కూడా చెప్పేవాణ్ని. కొంతసేపు చిన్నచిన్న కసరత్తులు కూడా చేశాం. ఎందుకంటే అందరూ అప్రమత్తంగా ఉండాలని మేం అనుకున్నాం. అప్పుడే సొరంగం నుంచి బయట పడగలమని భావించాం”అని శ్రీనివాస్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.