ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అన్ని జిల్లాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్‌ కూడా జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్‌ పోరులో ఓటు వేసేందుకు సాధారణ ఓటర్లతో పాటు రాజకీయ నేతలు, కార్యకర్తలు, పార్టీల అభిమానులు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ అనేది కొన్ని జిల్లాల్లో ఉత్సాహంగా మరి కొన్ని జిల్లాల్లో మందకొండిగా కొనసాగుతుంది. తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్లో

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పలు జిల్లాల్లో ఉత్సాహంగానూ, మరికొన్ని జిల్లాలో మందకొడిగానూ సాగుతోంది. తొలి రెండు గంటల్లో నమోదైన పోలింగ్‌ వివరాలను ఎన్నికల అధికారులు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఇందులో అత్యధికంగా గంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో 16 శాతం చొప్పున నమోదు కాగా.. విశాఖ, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో 14 శాతం చొప్పున, కృష్ణాలో 13 శాతం, నెల్లూరు, అనంతపురంలో 12 శాతం చొప్పున, కర్నూల్లో 11 శాతం, చిత్తూరులో 9 శాతం, కడపలో 8 శాతం నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సగటున 13 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది.