మహిళల సాధికారత కోసం ప్రభుత్వాలు రకరకాల పథకాలు అమలులోకి తీసుకువస్తున్నాయి.దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల అదనపు సాధారణ సెలవులు (సీఎల్‌) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 15 రోజుల సెలవులకు అదనంగా వీటిని ఇచ్చేందుకు వీలుగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.