వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం‌ విడుదల చేసిన బులిటెన్లో నిన్న రాత్రి 8 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలో 39,000 కరోనా నిర్థారణ పరీక్షలు జరుపగా 189 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,00,342కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతిచెందడంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1646కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 176 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,96,916కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,780 ఉండగా, 693 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 34 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 90,55,741కి చేరింది.