రిలయన్స్ జియో నెలకు రూ.1000 ఖర్చుతోనే చిన్న సంస్థలకు ఫోన్ కాల్స్, డేటా సహా ఇతర సర్వీసులు అందిస్తామని వెల్లడించి సంచలనం సృష్టించింది. మరింత మంది కస్టమర్లు లక్ష్యంగా మంగళవారం జియో బిజినెస్ కొత్త సర్వీసులు రిలయన్స్ జియో సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దీనితో ముకేశ్ అంబానీ మరోసారి ప్రత్యర్థులకు షాకిచ్చారు.

రిలయన్స్ జియో తాజా కొత్త సర్వీసుల ద్వారా 5 కోట్ల మంది కస్టమర్లను పొందాలని ప్రణాళిక వేసింది. సూక్ష్మ స్థూల మధ్యతరహా వ్యాపార సంస్థలు లక్ష్యంగా కంపెనీ ఈ సేవలు ఆవిష్కరించి, వీటికి మూడు రకాల సేవలు అందుబాటులో ఉంచనుంది.

అవి ఏంటంటే…
వాయిస్ అండ్ డేటా సర్వీసులతో కూడిన ఎంటర్‌ప్రైజ్ గ్రేడ్ ఫైబర్ కనెక్టివిటీ, డిజిటల్ సొల్యూషన్స్, డిజిటల్ సొల్యూషన్స్ అందించే డివైజెస్ అనేవి మూడు రకాల సేవలు. అదేసమయంలో కంపెనీ జియో బిజినెస్ సర్వీసుల కింద ఏడు టారిఫ్ ప్లాన్లు కూడా లాంచ్ చేసింది.

ప్రస్తుతం సూక్ష్మ, స్థూల మధ్య తరహా సంస్థలు కనెక్టివిటీ, ఆటోమేషన్ టూల్స్, ప్రొడక్టివిటీల కోసం నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో ఖర్చు చేస్తున్నాయి కావున తాము నెలకు రూ.1,000తోనే సర్వీసులు అందిస్తామని వెల్లడించింది. http://www.jio.com/business వెబ్‌సైట్‌కు వెళ్లి కాంటాక్ట్ డీటైల్స్ ఇవ్వడం ద్వారా ప్లాన్ వివరాలు మొత్తం చూడొచ్చు.