అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌బీఐ ఏటీఎమ్‌లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అందులోని నాలుగు మిషన్లు కాలి బూడిదయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపుచేసినప్పటికీ కూడా మిషన్లు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, బ్యాంకు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.