దేశంలో కరోనా రోగులతో హాస్పిటల్స్ నిండిపోవడంతో బెడ్లు దొరక్క వైరస్ బాధితులు అవస్థలు పడుతున్నారు. అలాగే షెంట్లకు చికిత్స అందించేందుకు వైద్యులు కూడా శ్రమిస్తున్నారు. అయితే, హాస్పిటల్స్ ఇప్పుడు కరోనా హాట్ స్పాట్లుగా మారిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఎయిమ్స్ లో భారీగా డాక్టర్లు (53 మంది డాక్టర్లు, విద్యార్థులు) వైరస్ భారీన పడ్డారు. దీంతో భోపాల్ ఎయిమ్స్ కు నిత్యమూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు కనుక గత కొంతకాలంగా కరోనా సోకిన వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్లు ఎవరిని కాంటాక్ట్ చేశారన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ‌(ఎయిమ్స్‌)లో 20 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వీరిలో 18 మంది రెసిడెంట్‌ డాక్టర్లు, మరో ఇద్దరు ఫ్యాకల్టీ సభ్యులు,మరో ఆరుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరందరిలో ముగ్గురు మాత్రమే కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు, మిగిలినవారు ఇంకా టీకా తీసుకోవాల్సి ఉండగా కరోనా సోకిందని వీరు వెల్లడించారు.