ముంబైకి చెందిన గంజాయి మాఫియా కీలక సూత్రధారి బాబుఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాబుఖాలే ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు గుర్తించిన పోలీసులు ఇవాళ హైదరాబాద్ శివారులో పట్టుకున్నారు. కొన్నేళ్లుగా బాబుఖాలే కోసం ఐదు రాష్ట్రాల పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ హైదరాబాద్ శివారులో బాబుఖాలేతో పాటు మరో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు.