విజయవాడ పరిధిలోని రామకృష్ణాపురంలో భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో భర్త జగాని రవి (40), తన పదేళ్ల కుమార్తెతో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన తర్వాత తమ అవయవాలను భార్య భరణికి ఇవ్వాలని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. రవి గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవారు. కొంత కాలంగా రవి భార్య భరణి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సత్యనారాయణపురం పోలీసులు తెలిపారు.