అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఇండోనేషియా భూకంపంలో ఆరుగురు మృతి

ఇండోనేషియాలో అకస్మాత్తుగా భూ ప్రకంపనలు రావడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన పర్యాటక ప్రాంతం బాలికి కొన్ని కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. అయితే ప్రకంపనలు సముద్ర గర్భంలో రావడంతో అందరూ సునామీ వస్తుందని భయపడ్డారు. కానీ అలాంటి ముప్పేమీ లేదని అక్కడి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

జావా సమీపంలో సముద్ర గర్భాన శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూ ప్రకంపనలు చెలరేగాయి. రిక్టర్‌ స్కేల్‌పై 6.0గా నమోదు కాగా ఈ ధాటికి ద్వీపకల్పంలోని కొన్ని భవనాలు కూలిపోయాయి. దీంతో ఆరుగురు మృతి చెందారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.