క్రైమ్ (Crime) వార్తలు (News)

లంచం డిమాండ్ చేసిన ఐటి అధికారి గుట్టు రట్టు

ముంబయిలోని గోరెగావ్‌ తూర్పు ప్రాంతంలో ఆదాయపు పన్ను(ఐటీ) ఇన్‌స్పెక్టర్‌ ఆశిష్‌ కుమార్‌ సీబీఐకి చిక్కారు. సీబీఐ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడిన ఓ వ్యక్తిని దీన్నుంచి బయటపడేస్తామంటూ బల్లార్డ్‌ పీర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఆశిష్‌తో పాటు మరో ఇద్దరు ఐటీ అధికారులు వేర్వేరుగా లంచం డిమాండ్‌ చేయగా అతని ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు వలపన్నారు. ఆ వ్యక్తి రూ. 5 లక్షలు ఆశిష్‌ కుమార్‌కు రాత్రివేళ అందజేయగా అతను ఆ మొత్తాన్ని ఓ బ్యాగులో ఉంచిన వెంటనే సీబీఐ అధికారులు చుట్టుముట్టడంతో ఆశిష్‌ డబ్బున్న బ్యాగును రోడ్డుపైకి విసిరేసి పరుగెత్తడం మొదలు పెట్టారు. దీంతో సీబీఐ అధికారి వినీత్‌ జైన్‌ ఆయన్ను వెంబడించి పట్టుకుని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో రూ. 10 లక్షలు డిమాండ్‌ చేసిన మరో ఐటీ ఇన్‌స్పెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. మూడో ఐటీ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాయ్‌పై కేసు నమోదు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.