దేశంలో తాజాగా 11,73,219 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 1,45,384 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,05,926 చేరుకుంది. గడచిన 24 గంటల్లో 794 మరణాలు సంభవించడంతో 1,68,436 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటికి 10,46,631మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.దీంతో క్రియాశీల కేసుల వాటా 8 శాతానికి చేరువైంది. మరోవైపు రికవరీ రేటు 90.8శాతానికి పడిపోయింది. నిన్న ఒక్కరోజే 77,567 మంది కోలుకోవడంతో వైరస్‌ను జయించిన వారి సంఖ్య కోటీ 20లక్షలకు చేరుకుంది.