‌కరోనా అంతకంతకు విజృంభిస్తున్న దరిమిలా అందరూ టీకా వేయించుకోవాలని ప్రభుత్వాలు ప్రకటిస్తున్న వేళ టీకాల కొరత వేధిస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో పలు కేంద్రాల్లో టీకాలు లేవని బోర్డులు ఏర్పాటవ్వడం, రాజస్థాన్‌లో రెండురోజులకే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించడం, మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోనూ టీకా అందలేదని ప్రజలు ఆందోళనకు దిగడం పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం నుండి టీకాలు పంపిణి కావాలనే అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.