క్రైమ్ (Crime) వార్తలు (News)

కనికరించని కన్నబిడ్డలు.. ఉసురు తీసుకున్న తల్లితండ్రులు..

భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని పట్వారీ గూడెంలో దూపకుంట్ల భూషణం(75), ఆదిలక్ష్మీ(70) దంపతులు కుమారులతో కాకుండా వేరుగా నివాసం ఉంటున్నారు. అయితే, వయసు రిత్యా వారికీ పలు అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో వారు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నా కుమారులు పట్టించుకోపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో శబ్దం రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి చూడగా అప్పటికే వారు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.