అంతర్జాతీయం (International) వార్తలు (News)

చైనాకు మరలా షాక్ ఇచ్చిన అమెరికా!!

ట్రంప్‌ హయాంలో మొత్తం 31 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చగా బైడెన్‌ వచ్చిన తర్వాత మరో 28 కంపెనీలను అందులో చేర్చారు. ఇప్పుడు తాజాగా మరో 10 చైనా కంపెనీల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టడాన్ని నిషేధిస్తూ బైడెన్‌ సర్కారు నేడు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన, షింజియాంగ్‌లో హైటెక్‌ నిఘా పరికరాలు పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు, మానవ హక్కుల విషయంలో చైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేసేందుకు బైడెన్‌ సర్కారు ఈ వ్యూహాన్ని అనుసరిస్తోన్నట్టు చెప్తోంది.

కాగా దీనిపై స్పందించిన చైనా “మా కంపెనీల హక్కులు, అవసరాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొన్నాం. మా అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యాన్ని ఏ మాత్రం ఆమోదించం” చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు.

ఈ జాబితాల విషయాన్ని ఇప్పుడే అమెరికా బయటకు వెల్లడించలేదు. దీనిపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ వెంటనే దీనిపై స్పందించలేదు. భవిష్యత్తులో మరిన్ని దేశాల కంపెనీలను ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నిఘా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని వీటిపై ఆరోపణలు చేసింది. చైనాలో షింజియాంగ్‌ ప్రావిన్స్‌లో దాదాపు 12 మిలియన్ల మంది వీఘర్లు ఉంటున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ చైనా వీరిని నిర్బంధిస్తోంది. వీరందరినీ రీ ఎడ్యుకేషన్‌ క్యాంపులుగా చెప్పే జైళ్లలోకి తరలిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా చైనా వీఘర్లపై ఇప్పటికే బలమైన నిఘా ఉంచింది. అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •