అంతర్జాతీయం (International) వార్తలు (News)

చైనా.. 8 మంది పిల్లలు.. రూ.3 కోట్ల జరిమానా??

చైనాలో ఇద్దరికి మించి పిల్లలను కనకూడదని దశాబ్దాలుగా చట్టం అమల్లో ఉండగా ఒక జంట మాత్రం అధికారుల కళ్లుకప్పి 8 మందికి జన్మనిచ్చింది. దీంతో చైనా ప్రభుత్వం వారికి 2.6 మిలియన్ యువాన్ (రూ. 3 కోట్ల)ల జరిమానా విధించింది. ఆ తర్వాత దానిని 90,000 యువాన్ (రూ.10 లక్షల)లకు తగ్గించింది.

చైనాలో కొడుకు పుట్టాలని దంపతులు తాపత్రయపడతారు. అందుకే కొడుకు కోసం లియు మౌహువా ఎదురుచూసి మొదటి భార్యకు వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో ఆమెకు విడాకులు ఇచ్చి మరో మహిళను చేసుకున్నాడు. రెండవ భార్యకు ఇద్దరు కొడుకులు ఓ కూతురు జన్మించింది. ఇక ఈ నేపథ్యంలోనే 8 మంది పిల్లలను కన్నందుకు గాను అతడికి జరిమానా విధించారు. కాగా కొద్దీ రోజుల క్రితం ముగ్గురు సంతానం కలిగి ఉండేందుకు అనుమతిస్తూ చైనా ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •