ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కేరళ లో హై అలర్ట్‌ .. ఎందుకు??

కేరళలో జికా వైరస్‌ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం హై అలెర్ట్‌ ప్రకటించింది. జికా వైరస్‌ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొనగా, కేరళ పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా జికా వైరస్‌ వ్యాప్తి విషయంలో అప్రమత్తమైంది.

చామరాజనగర్‌, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కేరళలో మొదట ఓ 24 ఏళ్ల గర్భిణిలో జికా వైరస్‌ లక్షణాలను గుర్తించారు. ఆమెతోపాటు మరికొందరి శాంపిళ్లను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. ఆమె సహా 14 మందికి జికా ఇన్ఫెక్షన్‌ ఉన్నట్టుగా తేలగా.. జికా ఇన్ఫెక్షన్‌ మరీ ప్రమాదకరమేమీ కాదని.. కొన్నేళ్లుగా మ్యుటేట్‌ అయి కొత్త వేరియంట్లు వస్తుండటంతో జాగ్రత్త తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •