టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు.. ఎప్పుడు??

ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌ను ఆగస్టు 19 నుంచి 25 వరకు కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ప్రకటించింది. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ను సెప్టెంబర్‌ 17, 18న విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనుండగా.. సెప్టెంబర్‌ 19న ఈసెట్‌ (అనంతపురం జేఎన్‌టీయూ), సెప్టెంబర్‌ 21న ఎడ్‌సెట్‌ (విశాఖ ఏయూ) పరీక్షలు నిర్వహించనుంది. ఇక తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 22న లాసెట్‌, సెప్టెంబర్‌ 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •