టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏపిలో అమ్మ ఒడి నగదు స్థానంలో ల్యాప్ టాప్‌లు..!!

ఆంధ్ర ప్రదేశ్ లో జగనన్న అమ్మ ఒడి అందుకుంటున్న 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుండి అమ్మ ఒడికి బదులుగా విద్యార్థులకు అవసరమైన ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్ అందించేలా పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ వివరించారు.

అలాగే విద్యార్థులకు ఎక్కువకాలం ఉపయోగపడేలా మూడేళ్ల అదనపు వారంటీని కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసి, పాఠశాల విద్యాశాఖ ద్వారా విద్యార్థులకు పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ల్యాప్‌టాప్ వినియోగంలో ఏదైనా ఇబ్బందులు తెలెత్తితే 7 రోజుల్లోగా పరిష్కరించేలా, అందుకోసం నోడల్ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పనిచేయాలని ఆదేశించింది.

కరోనా కారణంగా డిజిటల్ విద్యను ప్రాథాన్యం పెరగడం, ఆన్‌లైన్ క్లాసుల ద్వారా బోధన జరుగుతుండటంతో పేద కుటుంబాల వారికి అవసరమై ల్యాప్‌టాప్‌లను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది.

విద్యార్థుల ఆన్‌లైన్ స్టడీకి ఉపయోగపడేలా డ్యూయల్ కోర్ ప్రఫెసర్, 4జీబీ ర్యామ్‌, 500 జీబీ హార్డ్ డిస్క్ తో 14 అంగులాల స్ర్కీన్ తో ఆధునిక విండోస్ 10 లాప్ టాప్‌లను అందించాలని నిర్ణయించినట్టుగా సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •