జాతీయం (National) వార్తలు (News)

స్టీల్ ప్లాంట్ విషయమై లోక్ సభలో పోరాడుతానని ఎంపీ హామీ!!

స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితుల ఆందోళనలను ఏ మాత్రం కేంద్రం పట్టించుకోవడం మానేసి దూకుడుగా ముందుకు వెళ్తూ ఈ ఏడాది చివరకల్లా ప్రైవేటీకరణ పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తుంది.

పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం, ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో కూడా వెనక్కి తగ్గలేదు. కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గణనీయమైన పాత్ర పోషించడంతో కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని అంతా ఆశించారు. కష్టసమయంలోనూ విశాఖ ఉక్కు కార్మికులు రెండింతలు శ్రమించి ప్లాంట్ ను లాభాల బాట పట్టించినప్పటికీ కేంద్రం మాత్రం ముందుకే వెళ్తోంది. ప్రైవేటీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సలహాదారులను నియమించింది. వీరిలో ఒకరు లావాదేవీల సలహాదారు కాగా మరొకరు న్యాయసలహాదారు.

కార్మికులు ఎన్ని రకాల పోరాటాలు చేసిన కేంద్రం చెవిన వారి నినాదాలు పడకపోవడంతో ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు ఈ పోరాటానికి ఇప్ప‌టికే వివిధ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. ఏపీలో ఉన్న ఎంపీలంతా స్టీల్‌ప్లాంట్ కోసం పార్ల‌మెంట్‌లో పోరాడాల‌ని కార్మిక సంఘాలు కొరుతున్నాయి. అందుబాటులో ఉన్న ఎంపీలు అందర్నీ కలుస్తున్నాయి కార్మిక సంఘాలు, మొదట అనకాపల్లి ఎంపీని కలిసి వినతి పత్రం ఇచ్చిన కార్మిక సంఘాలు.. తరువాత ఎంపీ రామ్మోహన్ నాయుడుని కలిశాయి. ఉక్కు ప్రైవేటీకరణ పాలని.. ఆంధ్రుల ఆవేదనను పార్లమెంట్ లో గట్టిగా వినిపించాలని కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతల వినతిపై రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయాన్ని ఆపేందుకు రాజీనామాలు చేసే ధైర్యం మాకుంది.. వైసీపీకి చెందిన 28 మందికి ఆ సత్తా ఉందా అని ప్రశ్నించారు రామ్మోహన్ నాయుడు. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •