టెక్నాలజీ (Technology) వార్తలు (News)

సాగర్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేసిన జెన్‌కో!!

నాగార్జునసాగర్‌లో గత నెల 29 నుంచి 11 రోజుల్లో 30 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేసినప్పటికీ ప్రస్తుతం జలవిద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్‌కో నిలిపివేసింది. దానికి కారణం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీయడమే! విద్యుత్‌ ఉత్పత్తిని నిబంధనల మేరకే చేస్తున్నామని తెలంగాణ స్పష్టం చేస్తూ తమకు కేటాయించిన నీటి వాటాను వాడుకుంటున్నామని తేల్చి చెప్పింది. శ్రీశైలంలో గరిష్ఠమట్టాలకు నీరు చేరకూడదనే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని ఏపీ వాదిస్తోంది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం మరియు కృష్ణా జలాల కేటాయింపులపై ఈ నెల 24న కేఆర్ఎంబీ పూర్తి స్థాయి సమావేశంలో చర్చించనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    215
    Shares
  • 215
  •  
  •  
  •  
  •