వార్తలు (News)

మహారాష్ట్రలో 21 నుంచి 45కి పెరిగిన డెల్టా వేరియంట్ కేసులు!!

‘మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు 21 నుంచి 45కి పెరిగినట్టుగా వారిలో 27 మంది పురుషులు కాగా, 18 మంది స్త్రీలు ఉన్నట్టుగా మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి, పర్యటించిన ప్రాంతాలు, సన్నిహితుల గురించిన పూర్తి వివరాలు ఇంకా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకైతే ఎవరి పరిస్థితి ఆందోళనకరంగా లేదు అని తోపే మీడియాకు వెల్లడించారు.

డెల్టా వేరియంట్‌ నుంచి రూపాంతరం చెందిందే డెల్టా ప్లస్. ఇది కరోనా రెండో దశ వేళ మహారాష్ట్రలో వెలుగుచూడగా దీనిని ఆందోళనకర వేరియంట్‌గా జూన్‌లో కేంద్రం ప్రకటించింది. 18 సంవత్సరాల లోపువారిలో కూడా ఈ వేరియంట్ బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •