ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేయాలంటే..??

ముంబయిలో లోకల్‌ రైళ్లలో ప్రయాణించాలంటే రెండు డోసుల కొవిడ్‌ టీకాలు తీసుకోవలసిందే అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేసారు. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ఇంతవరకు ఈ రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే అనుమతిస్తుండగా ఇప్పుడు తాజాగా రెండో డోసు తీసుకుని 14 రోజులు పూర్తయివారికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.

కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌తో సోమవారం సమావేశం నిర్వహిస్తామని.. అనంతరం దుకాణాలు, మాల్స్, రెస్టారెంట్లు, మతపరమైన ప్రార్థన మందిరాల్లో నిబంధనల సడలింపు విషయం ఆలోచిస్తామని ఠాక్రే అన్నారు. కొవిడ్‌ మూడో ఉద్ధృతి రాకుండా అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉందని, తగిన జాగ్రత్తలు పాటించడంతోనే ఇది సాధ్యమని అన్నారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్నచోట నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •