ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

వెన్నెముక దృఢంగా చేసే ఆసనాలతో ఉపయోగం ఉంటుందా??

మానవ శరీర నిర్మాణంలో వెన్నెముక చాలా ముఖ్యమైనది. మనం ఎలాంటి పని చేయాలన్న.. కనీసం నిల్చోవాలన్నా కూడా వెన్నెముక సహకరించవలసిందే! బరువులు ఎత్తాలన్నా, వంగి పనిచేయాలన్నా, సరిగా కూర్చోవాలన్నా వెన్నెముక దృఢంగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితులలో మారిన జీవన శైలి, అలవాట్లు రోజువారి భంగిమల కారణంగా వెన్నెముకపై ఒత్తిడి పెరిగి రోజు రోజుకూ బలహీనంగా మారి చాలామందికి వెన్నులోని డిస్కులు పక్కకు జారిపోతున్నాయి.

పక్కన ఉన్న నరాలపై ఒత్తిడి పెరిగి నడుము నొప్పితో బాధపడుతుంటారు. అయితే ఈ నడుమునొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు సాధన చేస్తుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలామందిని డిస్క్‌ ప్రొలాప్స్‌ సమస్య వేధిస్తోంది.

ఈ నొప్పి కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు. పడుకుంటే మాత్రం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. కొంతమందిలో ఎన్ని మందులు వాడినా తగ్గక పోవడంతో మానసిక క్షోభతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు యోగా చేయడం ద్వారా 80 నుంచి 90 శాతం ఉపశమనం పొందుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాగే వెన్నునొప్పి తగ్గించడానికి సేతుబంధాసనం, మేరు దండ ముద్ర ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి!

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ముందు వైద్యులను సంప్రదించాలి అన్నది ప్రాధమిక సూత్రం అని మర్చిపోకండి! ఏ ఒక్కరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. ఒకరికి మేలు చేసే ఔషధం వేరే వారికి ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే ఎలాంటి ప్రయత్నం అయినా చేయమని మనవి!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •