ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఇంటివద్దే కొవిడ్‌ పరీక్ష.. అమెరికా శాస్త్రవేత్తల ఆవిష్కారం!!

అమెరికా శాస్త్రవేత్తలు సొంతంగా ఇంటి వద్దే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు వీలు కల్పించే విధానాన్ని వృద్ధి చేసారు. ఇది లాలాజలాన్ని విశ్లేషిస్తుందని, చాలా చౌకైందని, ఉపయోగించడం చాలా తేలిక అని తెలుస్తుంది. అంతే కాకుండా గంటలోగా మన స్మార్ట్‌ఫోన్‌ యాప్‌పై ఫలితాన్ని పొందొచ్చ మరియు ఇది కరోనాలోని మూడు భిన్న వేరియంట్లను విజయవంతంగా గుర్తించగలిగింది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు కనిపెట్టిన ఈ సాధనం పేరు ‘మినిమల్లీ ఇన్‌స్ట్రూమెంటెడ్‌ షెర్లాక్‌’ (మి షెర్లాక్‌).

డెల్టా వంటి అదనపు రకాలను గుర్తించేలా ఈ సాధనంలో సర్దుబాటు చేయవచ్చని త్రీడీ ప్రింటర్, సాధారణంగా అందుబాటులో ఉన్న ఉపకరణాల సాయంతో ఈ యంత్రాన్ని సిద్ధం చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘రోగి నమూనాలను కేంద్రీకృత పరీక్ష ప్రదేశానికి తరలించాల్సిన అవసరాన్ని మి షెర్లాక్‌ తప్పించడం వల్ల ప్రజల ఆరోగ్య స్థితి గురించి వైద్యులకు చాలా త్వరగా, మరింత స్పష్టమైన సమాచారం లభిస్తుంది. మహమ్మారి విజృంభణ సమయంలో ఇది చాలా కీలకం’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న హెలీనా డి పగ్‌ చెప్పారు. జన్యువుల్లో మార్పులు చేయడానికి ఉపయోగించే క్రిస్పర్‌ పరిజ్ఞానంతో ‘మి షెర్లాక్‌’ను తయారు చేయగా ఇది క్రిస్పర్‌లోని కాస్‌12ఎ అనే పరమాణు కత్తెరను ఉపయోగించుకొని, కరోనా వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏలో ఉన్న న్యూక్లియోప్రొటీన్‌ ప్రాంతాన్ని కత్తిరిస్తుంది. ఈ క్రమంలో ఒక ఫ్లోరసెంట్‌ సంకేతం వెలువడుతుంది. దీని ఆధారంగా కరోనా ఉనికిని గుర్తించొచ్చు. వైరస్‌లోని ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లను ఈ సాధనం సులువుగా పసిగడుతుంది. ప్రస్తుతం రోగి ముక్కు, గొంతు నుంచి నమూనాలను స్వీకరిస్తుండడంతో ‘మి షెర్లాక్‌’ విధానంలో లాలాజల నమూనాలను పరీక్షిస్తున్నందు వల్ల అలంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •