అంతర్జాతీయం (International) జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

అంగారకుడిపై నివాసముండే వారి కోసం దరఖాస్తులు ఆహ్వానించిన నాసా!!

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- ‘నాసా’ తాజాగా ఒక ప్రకటన చేసి పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంగారక గ్రహం తరహాలో కృత్రిమంగా సృష్టించిన వాతావరణంలో ఏడాది పాటు నివసించేందుకుగాను ఔత్సాహికుల నుంచి ఆ సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుతానికి అమెరికా పౌరులు, అక్కడ శాశ్వత నివాస హోదా ఉన్నవారే దీనికి అర్హులు.

హ్యూస్టన్‌లోని జాన్సన్‌ అంతరిక్ష కేంద్రంలోని ఓ భవనంలో ‘మార్స్‌ డ్యూన్‌ ఆల్ఫా’ అనే 1,700 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రత్యేక ఆవాసం ఉంది. త్రీడీ ముద్రిత విధానంలో సృష్టించిన ఈ ఆవాసంలో అంగారక గ్రహం తరహా వాతావరణం ఉంటుంది. అంగారకుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్న నాసా అక్కడికి వెళ్లేవారికి శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందో ముందుగానే తెలుసుకోవాలని నిర్ణయించింది.

దీంతో పరిమిత వనరులు, కమ్యూనికేషన్‌లో జాప్యం, పరికరాల వైఫల్యం వంటి సవాళ్లను వారు ఎలా ఎదుర్కొంటారన్నదానిపై అధ్యయనానికి సిద్ధమై ఇందులో భాగంగా ఔత్సాహికులైన అమెరికా పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. వారి నుండి నలుగుర్ని ఎంపిక చేసి ఏడాది పాటు ‘మార్స్‌ డ్యూన్‌ ఆల్ఫా’లో ఉంచుతామని ప్రకటన చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •