క్రైమ్ (Crime) వార్తలు (News)

వాట్సాప్ గ్రూప్ లో లంచాల అధికారి!!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేష్‌చందర్‌ ఛటర్జీ ఎనిమిదేళ్లుగా మండల వ్యవసాయాధికారి(ఏవో)గా పనిచేస్తున్నారు. తనిఖీలు చేయకుండా ఉండేందుకు నెలవారీగా ఇచ్చే లంచం సొమ్ము ఇవ్వాలంటూ మండలంలోని పురుగుమందులు, ఎరువుల యజమానులను డిమాండ్‌న చేస్తూ ఏకంగా ఇందుకోసం వాట్సప్‌లో గ్రూపు ఏర్పాటు చేసి ఈ నెలలో దుకాణానికి రూ.15 వేలు ఇవ్వాలంటూ సందేశాలు పంపాడు.

ఈ విషయమై చంద్రుగొండలోని ఆరు దుకాణాల యజమానులు జులై 30న ఏసీబీకి ఫిర్యాదు చేయగా పథకం ప్రకారంగా ఆరు దుకాణాల నుంచి నగదు సేకరించిన వారు ఆ సొమ్ము తీసుకోవడానికి రావాలంటూ ఏవోను కోరారు.దాని ప్రకారం చంద్రుగొండ రైతు వేదికలో సోమవారం సత్యం, సీతారాములు నుంచి ఏవో రూ.90 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలో ఏసీబీ సీఐ రఘుబాబు సోదాలు చేసారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చామని, చట్టప్రకారం అధికారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    37
    Shares
  • 37
  •  
  •  
  •  
  •