ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

13ఏళ్ల బాలుడికి ‘ఒజాకీ’ శస్త్రచికిత్స!!

విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో గుండె అయోటిక్‌ వాల్వ్‌ దెబ్బతిన్న 13 సంవత్సరాల బాలుడికి అరుదైన ఒజాకీ చికిత్సా విధానంలో సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆర్‌.దిలీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఒజాకీ విధానంలో శస్త్ర చికిత్స చేయడం ఇదే మొదటిసారని, దేశం మొత్తం మీద ఇంత వరకు ఈ విధానంలో చేసిన ఆపరేషన్లు పది లోపే ఉంటాయని, అయోటిక్‌ వాల్వ్‌ దెబ్బతిన్న వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న శస్త్ర చికిత్స విధానాలన్నిటి కంటే ఇది చాలా మెరుగైందని, తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని దిలీప్‌ కుమార్‌ వివరించారు.

ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాల్లో పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయడంలో చాలా ఇబ్బందులున్నాయని, చేసిన తర్వాత కూడా వారిలో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని, వాటన్నిటికీ ఒజాకీ విధానం మెరుగైన ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ‘మేం చికిత్స చేసిన బాలుడి కవాటానికి పుట్టుకతోనే మూడు తలుపులు బదులు రెండే ఉన్నాయని, అవీ మూసుకుపోయాయని, అతడికి కావాల్సిన సైజ్‌లో కవాటం దొరక్కపోవడంతో ఒజాకీ విధానాన్ని అనుసరించి విజయం సాధించాం’ అని దిలీప్‌ కుమార్‌ తెలిపారు.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బయోప్రాస్టిక్‌ వాల్వ్‌ అమర్చాలంటే రూ.6-8 లక్షలు, మెకానికల్‌ వాల్వ్‌కి రూ.3 లక్షల నుంచి రూ.నాలుగున్నర లక్షలు ఖర్చవగా ఒజాకీ విధానంలో రూ.లక్షన్నరలోనే చికిత్స పూర్తవుతుంది అని దిలీప్‌ కుమార్‌ వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    44
    Shares
  • 44
  •  
  •  
  •  
  •