ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

స్కూళ్లు వెంట‌నే తెర‌వండి!

క‌రోనా కారణంగా దేశంలో స్కూళ్లు మూత‌బ‌డి ఏడాదిపైగా దాటింది. ఇంత‌కాలంగా ఇలా స్కూళ్లు మూత‌ప‌డ‌టం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ఇది విస్మ‌రించ‌లేని తీవ్ర‌మైన విష‌య‌మ‌ని పార్ల‌మెంట‌రీ ప్యానెల్ స్ప‌ష్టం చేస్తూ స్కూళ్లు మ‌ళ్లీ తెర‌వ‌డం అనేది విద్యార్థుల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌కరంగా ఉంటుంద‌ని, ఇంత‌కాలంగా స్కూళ్లు మూత‌ప‌డ‌టం కుటుంబాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపింద‌ని, చాలా మంది పిల్ల‌లు బాల కార్మికులుగా మారుతున్నార‌ని ఈ ప్యానెల్ వెల్ల‌డించింది.

చిన్న పిల్ల‌లు స్కూళ్ల‌కు వెళ్ల‌కుండా నాలుగు గోడ‌ల‌కే ప‌రిమితం కావ‌డం వ‌ల్ల త‌ల్లిదండ్రుల‌తో పిల్ల‌ల సంబంధాల‌పై కూడా ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతున్న‌ట్లు, అంతేకాదు దీని కార‌ణంగా బాల్య వివాహాలు, బాల‌కార్మికుల మ‌ళ్లీ పెరిగిపోతున్న‌ట్లు, అందుకే వెంట‌నే స్కూళ్లు తెర‌వ‌డం అనేది చాలా ముఖ్య‌మ‌ని త‌న నివేదిక‌లో ప్యానెల్ సిఫార‌సు చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    98
    Shares
  • 98
  •  
  •  
  •  
  •