జాతీయం (National) వార్తలు (News)

సరి కొత్త రికార్డుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు!!

రెండో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఈ ఉదయం 54,461 పాయింట్లతో మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 54,780 వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి చివరకు 151.81 పాయింట్ల లాభంతో 54,554.66 వద్ద ముగియగా, నిఫ్టీ కూడా 16,359 వద్ద ట్రేడయ్యి మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు డీలా పడి మరలా చివరకు 21.80 పాయింట్లు లాభపడి 16,280.10 వద్ద స్థిరపడ్డాయి.

బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 2శాతం, మిడ్‌క్యాప్‌ 1శాతం పడిపోగా నిఫ్టీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు రాణిస్తే.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐఓసీ షేర్లు నష్టపోయాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    11
    Shares
  • 11
  •  
  •  
  •  
  •