వార్తలు (News)

భారత్ లో 34,973 కొత్త కేసులు.. 260 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 17.87లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే 34,973 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31కోట్లును దాటింది. నిన్న ఒక్కరోజే 260 మంది కరోనాతో మృతి చెందడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,42,009 కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 37,681 మంది కరోనాతో కోలుకోవడంతో ఇప్పటివరకు 3.23కోట్ల మంది కరోనాను జయించి రికవరీ రేటు 97.49శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 3,90,646 మంది వైరస్‌తో బాధపడుతుండడంతో క్రియాశీల రేటు 1.18శాతంగా ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •