వార్తలు (News)

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం!!

తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేసిన వరుణుడు శాంతించడంతో పల్లెల్లో ఇప్పుడిప్పుడే పొడి వాతావరణం కనిపిస్తోన్నప్పటికీ వర్షం తాలూకూ వరదలు ఇంకా ఊళ్లను చుట్టుముట్టే ఉన్నాయి. వర్షం ఆగినప్పటికీ వరదలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 11 న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో వానలు తగ్గుముఖం పట్టినా ఆ ప్రభావం ఇంకా కనిపిస్తోంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి, తెలంగాణ కి దూరంగా కొనసాగుతుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఈ నెల 11వ తేదీన ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే 11 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. జూన్ 1 నుంచి మంగళవారం వరకు సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైనట్లుగా వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •