ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కోవిడ్ చికిత్సలో ఐవర్‌మెక్టిన్ వాడితే దుష్ప్రభావాలు తప్పవు..??

మనుషులు, పెంపుడు జంతువుల్లో క్రిములు, పరాన్నజీవుల నివారణకు ఐవర్‌మెక్టిన్ అనే ఔషధాన్ని వాడుతారు. అయితే దీనిని కొవిడ్ చికిత్సలో ఉపయోగించవద్దని వైద్య నిపుణులు హెచ్చరించారు. కరోనా వైరస్‌ను ఈ ఔషధం సమర్ధంగా అడ్డుకుంటుందని ఇప్పటివరకు ఆధారాలు లేవన్నారు. ఈ మందును అతిగా వాడితే వికారం, వాంతులు, మతిమరుపు, మూర్ఛతోపాటు మరణం కూడా సంభవించవచ్చని అమెరికాకు చెందిన ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఐవర్ మెక్టిన్‌ను మనుషులతోపాటు శునకాలు, గోవులు, గుర్రాలకు వివిధ రూపాల్లో ఇస్తుంటారు. మనుషులకు వాడే ఈ ఔషధ డోసుల వల్ల దుష్ఫ్రభావాలు పరిమితంగానే ఉంటాయి.

జంతువుల కోసం ఉత్పత్తి చేసిన డోసులను మనుషులు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ఈ దుష్ప్రభావాలు వెయ్యి రెట్లు అధికంగా ఉండవచ్చు అని మిన్నెసోటా పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ బౌల్‌వేర్ పేర్కొన్నారు. అమెరికాలో పశువుల మందుల దుకాణాల నుంచి చాలా మంది కొవిడ్ రోగులు ఈ ఔషధాన్ని తీసుకెళ్లి వాడుతుండడం పట్ల వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్, బ్రెజిల్ దేశాల్లోనూ కొవిడ్ చికిత్సలో భాగంగా ఐవర్‌మెక్టిన్‌ను వినియోగిస్తున్నారు. ఎఫ్‌డిఎ సూచించిన వ్యాధులకు మాత్రమే ఈ మందును తగిన డోసుల మేర వాడుకోవాలి. ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు దీన్ని వాడడం తక్షణం ఆపేయాలని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులను హెచ్చరించింది..

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •