అంతర్జాతీయం (International) వార్తలు (News)

మెక్సికో లో భారీ భూకంపం!!

మెక్సికోలో మంగళవారం రాత్రి పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. భూకంప కేంద్రం గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కి ఆగ్నేయంగా 11 కిలోమీటర్లు (ఏడు మైళ్లు) దూరంలో కేందద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది.

ప్రధానంగా రాజధాని నగరంలో భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకులోనై ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు. కంపన తీవ్రతకు వందలాది కిలోమీటర్ల దూరంలో పలు భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలిపోయాయి. ముందుగా నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ తెలిపారు. ఒక వ్యక్తి మరణించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు.

కొయుకా డి బెనిటెజ్ నగరంలో యుటిలిటీ పోల్ పడి ఒక వ్యక్తి మరణించాడని, గెరెరో రాష్ట్ర గవర్నర్ హెక్టర్ అస్తుడిల్లో మిలెనియో టీవీకి చెప్పారు. అకాపుల్క్‌ మేయర్ అదెలా రోమన్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందుతున్నారనీ, చాలా ప్రాంతాలలో గ్యాస్ లీకేజీలు వార్తలు వచ్చినట్టు తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •