జాతీయం (National) రాజకీయం (Politics) వార్తలు (News)

పలు రాష్ట్రాల గవర్నర్ లకు బదిలీ!!

పలువురు గవర్నర్‌లను బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటివరకు తమిళనాడు గవర్నర్‌గా ఉంటూ పంజాబ్‌ అదనపు బాధ్యతలు కూడా చూసిన బన్వరీలాల్‌ పురోహిత్ ఇప్పుడు పంజాబ్‌కు బదిలీ అయ్యారు. నాగాలాండ్‌ గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవి తమిళనాడు గవర్నర్‌గా నియామకమయ్యారు. విశ్రాంత లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా నియామకమయ్యారు. అస్సాం గవర్నర్‌ జగదీశ్‌ ముఖికి నాగాలాండ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబి రాణి మౌర్య రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •