అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

రష్యాలో విమానం కూలిన ఘటనలో 19 మంది దుర్మరణం!!

రష్యాలో తతర్‌స్థాన్‌ ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 22 మంది ఉండగా వీరిలో 19 మంది మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.

రష్యాకు చెందిన ఎల్‌-410 తేలికపాటి విమానం 20 మంది స్కైడైవింగ్‌ క్లబ్‌ సభ్యులు, ఇద్దరు సిబ్బందితో బయల్దేరి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కూలిపోయింది. రష్యాకు చెందిన అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటన మెన్సెలిన్స్క్‌ పట్టణం సమీపంలో జరిగింది. ప్రమాదానికి ముందు ఈ విమానం రాడార్ల నుంచి అదృశ్యమైంది. ‘‘ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. సహాయక బృందాలు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలను దర్యప్తు బృందం తెలుసుకొనే యత్నం చేస్తోంది’’.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    13
    Shares
  • 13
  •  
  •  
  •  
  •