జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏపిలో సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు!!

యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. విజయవాడలో 29 కేంద్రాలు ఏర్పాటు చేయగా 18,674 అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక పరీక్ష పూర్తయింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు మరో పరీక్ష జరిగింది. ఈ-అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు పత్రం తెచ్చుకున్న అభ్యర్థులనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. సెల్‌ఫోన్‌, బ్లూటూత్, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. కొవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించడం తదితర చర్యలను అధికారులు పక్కాగా అమలు చేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    5
    Shares
  • 5
  •  
  •  
  •  
  •