క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

హెటిరో డ్రగ్స్‌ రైడ్స్..రూ.142 కోట్లు??

హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న సంగతి పాఠకులకు విదితమే! ఈ సోదాల్లో హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహించారు. ఇతర దేశాలకు హెటిరో భారీగా మందులు ఎగుమితి చేసింది. అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు మందులను ఎగుమతి చేసింది. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

కొన్ని ఆధారాలను హెటిరో ధ్వంసం చేసినట్లు, చాలా వరకు నకిలీ ఇన్వాస్‌లు తయారు చేసినట్లుగా ఐటీ గుర్తించింది. కంపెనీ డబ్బులతో యాజమాన్యం భారీగా స్థలాలు కొనుగోలు చేసింది. 16 బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. రూ.142 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.550 కోట్ల నగదు నిల్వలపై లెక్కలు ఇంకా తేలవలసి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •