అయినవిల్లి వినాయకుడిని దర్శించుకున్న సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అయినవిల్లి లో వెలసిన శ్రీ విగ్నేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం ఉదయం ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. రాజేంద్రప్రసాద్ రాక తెలుసుకున్న ఈవో తారకేశ్వర రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజేంద్ర ప్రసాద్ అయినవిల్లి వినాయకుడి కి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు సురేష్ ఆధ్వర్యంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి, శేష వస్త్రముతో సత్కరించి, స్వామివారి ప్రసాదం ఆయనకి అందజేశారు.