అర్హులైన ప్రతి వికలాంగులకు ఇంటివద్దకే ఆర్టీసీ బస్సు పాస్ మంజూరుచేసి అందిస్తున్నామని రావులపాలెం ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ అజిత్ కుమారి అసిస్టెంట్ మేనేజర్ అచ్యుతాంభ తెలిపారు. ఆలమూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో గత కొన్ని రోజులుగా ఆయా సచివాలయాల వద్ద రావులపాలెం ఆర్టీసీ ప్రతినిధులు కెవికె రావు, ఆర్ రామకృష్ణ, కె కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి దివ్యాంగుల వద్దనుండి ఏపీఎస్ఆర్టీసీ పాస్ ల కొరకు దరఖాస్తులను స్వీకరించారు. అన్నీ అర్హతలను పరిశీలించిన తరువాత రావులపాలెం ఆర్టీసీ మేనేజర్ అజిత్ కుమారీ చేతులమీదుగా ఆలమూరు (11), చింతలూరు(22), సూర్యారావుపేట(5), సందిపూడి (4), పెదపల్ల (17), కలవచర్ల(1), జొన్నాడ (31),మడికి (6), చెముడులంక (10) మొత్తం 107 మందికి అసిస్టెంట్ డిపో మేనేజర్ అచ్యుతాంబ ఆధ్వర్యంలో ఆయా సచివాలయాల వద్ద పంపిణీ చేశారు. మిగిలిన గ్రామాల్లో ఆయా గ్రామ సచివాలయాల వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేసి దివ్యాంగుల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని డిపో మేనేజర్ అజిత్ కుమారీ తెలిపారు. అలాగే ఆర్టీసీ సిబ్బందికి సహాయ సహకారాలు అందించిన ఆలమూరు మండల ప్రజాపరిషత్ ఏవో టీవీ సురేందర్రెడ్డికి, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.