వార్తలు (News)

ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పత్రికా ప్రకటన…

పశ్చిమగోదావరి జిల్లా… ఏలూరు…9.11.2020..

పత్రికా ప్రకటన…

అక్రమంగా లే అవుట్లు వేసి సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలిగించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారి భరతం పట్టాలని ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు.. ఏలూరు నియోజకవర్గంలో 2014నుండి ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన, కామన్ సైట్స్ కబ్జా చేసి పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగిన పట్టించుకోవపోవడం అధికారులు ఏమి చేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు….గత టీడీపీ పాలనలో స్థానిక నాయకులు ప్రోద్బలంతో కామన్ సైట్స్ కూడ వదలకుండా ఆక్రమించుకోవడంపై మంత్రి ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు…ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం రెవిన్యూ, పంచాయతీ రాజ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షించారు.. ఏలూరు నియోజకవర్గం పరిధిలో 7పంచాయతిల్లో ఆక్రమణకు గురైన స్థలాలు గుర్తించడానికి సెర్వే చేసి వారం రోజుల్లో సమగ్రంగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు… ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 10శాతం కామన్ సైట్ ప్రభుత్వానికి భవిష్యత్తు అవసరాలు కోసం ఇచ్చి ఆ తర్వాత లబ్ధిదారులకు స్తలం రిజిస్ట్రేషన్ చేయాలి కదా, నిబంధనలు పట్టించుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించుకుంటే పంచాయతీ స్థాయిలో అధికారులు ఏమి చేస్తున్నారు…ప్రభుత్వనికి రావలసిన ఆదాయానికి గండి కొడితే అలాంటి వారిని ఎంత మాత్రం ఊరుకునేది లేదని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.. లే అవుట్ దారులు కామన్ సైట్ వదలకుండా ఆ స్థలాన్ని కూడ అమ్ముకుంటున్నారని, భవిష్యత్తు అవసరాలు నిమిత్తం కామన్ సైట్ లో కమ్యూనిటీ హాల్, ప్రభుత్వ భవనం కట్టాలి అంటే స్థలం కబ్జా కు గురై ఎవరు బాధ్యత వహిస్తారని ఒకింత మంత్రి ఆళ్ల నాని తీవ్రంగా ప్రశ్నించారు… కొంతమంది పంచాయతీల్లో ప్లాన్ అప్రూవల్ లేకుండా లే అవుట్లు వేచి ప్రభుత్వనికి ఆదాయం రాకుండా గండి కొడుతూ స్థలాలను అమ్ముకుంటున్నారని తద్వారా సామాన్యుడు తీవ్రంగా నష్ట పోయే పరిస్థితి ఏర్పడుతుందని అలాంటి స్థలాలను వెంటనే గురించాలని, ప్రభుత్వ స్థలంలో భవనాలు కడితే వెంటనే ఆ స్థలాలను స్వాధీనపరచుకోవాలని మంత్రి ఆళ్ల నాని రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.. గ్రామ పంచాయతీల్లో జి +2మాత్రమే గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం అనుమతి ఇవ్వాలని నిబంధనలు ఉంటే చాలా గ్రామాల్లో జి +5 అపార్ట్మెంట్స్ కడుతున్నారని, ఆ విధంగా వ్యవహరించిన బిల్డర్స్ నుండి అపరాధ రుసుము వసూలు చేయాలని మంత్రి ఆళ్ల నాని అధికారులకు సూచించారు… కబ్జా దారులు నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని స్థలం కొనుకున్న సామాన్యుడు నష్ట పోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.. ఈ సమావేశంలో ఏలూరు MRO సోమశేఖర్, MDO మనోజ్,డివిజనల్ పంచాయతీ అధికారిని సంపత్ కుమారి, కుమారి టౌన్ ప్లానింగ్ అధికారులు, గ్రామ పంచాయతి కార్యదర్శి లు పాల్గొన్నారు…

**********************
పి. ఆర్. ఓ…టు…ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి…

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.