పత్రికా ప్రకటన
******
సచివాలయం : ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో తరగతులకు హాజరవుతున్నారు. ఇందుకు సంభందించిన వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

ఈనెల 2 వ తేదీన పాఠశాలలు తెరవగా 10వ తేదీ నాటికి క్రమేణా హాజరు పెరుగుతుంది. సోమవారం 52.17 శాతం 10వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 35.22 శాతం హాజరు కాగా, 90 శాతం ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు. మొత్తంగా విద్యార్థుల హాజరు 43.71కి చేరింది.

మొత్తం ఇప్పటివరకు హాజరు పరిశీలిస్తే 2వ తేదీన 42 శాతం విద్యార్థులు, 3న 33.69 శాతం విద్యార్థులు హాజరవ్వగా 4వ తేదీన 40.30 శాతం, 5వ తేదీ 35 శాతం, 6న హాజరు శాతం 43.89 ఇలా నిలకడగా10వ తేదిన 43.71కి చేరగా 10వ తరగతి విద్యార్థులు మాత్రం క్రమేణా పెరుగుతూ 52.17శాతం హాజరు నమోదైంది.

జూనియర్ కళాశాలల్లో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాజరు 35.69 నమోదైంది. డిగ్రీ కళాశాలల్లో రెండవ సంవత్సరం 31.33, మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 38.78 శాతం హాజరయ్యారు.

కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన ద్యేయంగా అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.