వార్తలు (News)

చిరంజీవ సుకీభవ – రాందాస్ చందక..

993 నవంబర్ 15… (తెల్లవారి 6.20 నిమషాలుకు ) సరిగ్గా చెన్నై మీనం బాకము విమానాశ్రయము నుంచి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయముకు, 272 మంది ప్రయానుకూలుతో, ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ బస్సు 300,, బయలుదేరింది ,, సరాసరి 7గంటలుకు హైదరాబాద్ బేగంపేట చేరింది ,,తెల్లవారి ప్రయాణము అవటము ఎపుడో 3 గంటలకు లేచి తయారు అయి , మాంబలము (టి నగర్ ) నుంచి శివారును (ఆ రోజుల్లో ) ఉన్న విమానాశ్రయము కు చేరుకోవాలి,,

నిద్ర లేక, ఆ 30 నిమషాలు విమానంలో ఓ కునుకుతీసి, హైదరాబాద్ రాగానే సర్ధుకునే లోపే, దట్టమైన మంచు (చలి కాలము కావడముతో ) విమానము దిగేందుకు అనువు కాక, కాక్ పిట్ నుంచి సైగలు,, మరలా మనము చెన్నయ్ వెళుతున్నాము,, ఇంతలో ప్రయాణికులకు నిద్ర మొత్తము దిగి ఏమి జరిగిందో తెలిసే లోపే, తిరుగు ప్రయాణము, సరిగ్గా విమానంలో ఇంధనం సుమారు కాలి అవడము,, పైలెట్ బల్లా ఎదో సైగలు చేస్తూ వుండటము,,

అదే విమానంలో మొదటి వరుస లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు చూడటము,, (ప్రక్కనే ఉన్న నటి విజయశాంతి, సహనటుడు విక్టరీ వెంకేటేష్ కాకున్నా సుమారు సగానికి పైగా సినిమా సాంకేతిక నిపుణులు ఉన్నారు) వెను వెంటనే విజయశాంతిని, వెంకేటేష్ తదితరులను అప్రమత్తము చేయడము, విమానము లాండింగ్ సరిగ్గా తిరుపతి కు వెంకటగిరి కు సమీపములో బాలాజీ పల్లె గ్రామ శివారుల్లో ,నాట్లు వేసే పొలములో అవటము, ఎమర్జెన్సీ ద్వారాన్ని పగలు గొట్టి నిజజీవితములో కూడా మెగా స్టార్ అనిపించుకునే విధముగా అందరిని క్రిందకు పంపి, తాను ప్రాణాలు కాపుడుకున్న చిరంజీవుడు … ఈ కొణిదల శివశంకర్ వరప్రసాద్ …

చిరు అభిమానులు,, చిరంజీవి అన్న పదానికి ఎంతో పులకరిస్తారు.. అలాంటి అజేయుడుకు, ఎంతో మంది మాలాంటి విదేశములో ఉన్న అభిమాన గణానికి నిత్యమూ ఆక్సిజన్, అయిన అంజనాపుత్రుడు కు కరోనా ఏమి చేస్తుంది, అందరిలా కాకున్నా ఎంతో సామజిక స్పృహ తో తనుకు ఎలాంటి కరోనా ఛాయలు లేకపోయినా రిపోర్ట్ పోజిటివ్ వచ్చింది అని తానే స్వయముగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి సమాజము పై తనుకున్న బాధ్యత ఇనుమిడింప చేసిన గొప్ప సంస్కరవంతుడు ఈ మెగా దీరుడు .. .అలాంటి మెగాస్టార్ కు ఏమీ కాదు ,,

తాను ఎపుడూ చిరంజీవి గానే ఉంటారు….
చిరంజీవ సుకీభవ ….
Ramadas Chandaka.. CMYF MUSCAT

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.