వార్తలు (News)

చైల్డ్ రైట్స్ అండ్ యు (క్రై) సంస్థ సేవలు అభినందనీయం. –ఆలమూరు ప్రభుత్వ వైద్యురాలు కన్యాకుమారి.

తూర్పుగోదావరి జిల్లా
చైల్డ్ రైట్స్ అండ్ యు (క్రై) స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు కే కన్యాకుమారి కొనియాడారు. మండల కేంద్రమైన ఆలమూరుకు చెందిన శ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ( క్రై) చైల్డ్ రైట్స్ అండ్ యు సంస్థ బెంగళూరు వారి సహకారంతో ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాలలో గల సీహెచ్సీ (2), పీహెచ్సీ (5) ఆస్పత్రిలో కోవిడ్ డిసాస్టర్ రెస్పాన్స్ ప్రోగ్రాంలో భాగంగా సర్జికల్ మాస్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి 16 వందల మాస్కులు అందిజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో శ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ వారు క్రై బెంగళూరు సహకారంతో ఇటువంటి మాస్కులు పంపిణీ చేస్తూ అమూల్యమైన సహాయ సహకారాలు అందిచడం మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కోవిడ్ అంతమొందించడానికి మాస్కు ఒక్కటే సరైన మార్గమని ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. కరోనా సెకండ్ వే ప్రారంభమైన ఈ దశలో మాస్కులు పంపిణీ చేయడం అనేది మంచి కార్యక్రమాన్ని తెలియజేశారు. శ్రమ ప్రాజెక్ట్ డైరెక్టర్ శేషగిరి రావు గారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది యొక్క సేవలు అభినందనీయమని వారు చేస్తున్న సేవలను గుర్తించి క్రై బెంగళూరు వారి సహకారంతో శ్రమ స్వచ్ఛంద సంస్థ తరుపున వైద్య సిబ్బంది వారికి ఆరోగ్యాన్ని కాపాడు కొనుటకు ఈ మాస్కులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. కరోనా రెండో దశ ప్రారంభమైన ఈ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సహకరించి వ్యాధి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రమ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జిల్లెల్ల శేషగిరి రావు , ఆలమూరు మండలం, కపిలేశ్వరపురం మండలం వైద్యులు, వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు , ఏఎన్ఎంలు, గ్రామ వాలంటరీ లు, శ్రమ కో ఆర్డినేటర్ బి. నాగేశ్వరి, వై రమణయ్య, చిన్న బాబు, కే సుధాకర్,
జి. భారతి పాల్గొన్నారు

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.