పత్రికా ప్రకటన తిరుపతి, 2020 నవంబరు 10
టిటిడి ఆస్తులను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, పరిసర ప్రాంతాల్లో గల టిటిడి ఆస్తులను జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి మంగళవారం పరిశీలించారు.
తిరుపతిలోని ఎస్జిఎస్ ఆర్ట్స్ కళాశాల సమీపంలో, భారతీయ విద్యాభవన్, ఎస్వీ అరవింద నేత్ర వైద్యశాల, ఎస్వీ శిల్ప కళాశాల, తిరుపతి రూరల్లోని బ్రాహ్మణపట్టు, అప్పలాయగుంటలోని కల్యాణమండపాలను జెఈఓ పరిశీలించారు. ఆయా ఆస్తుల వద్ద ప్రస్తుత పరిస్థితిని గమనించి నిర్వహణ మెరుగ్గా ఉండేలా అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఈఓ వెంట టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున, డిఎఫ్ఓ శ్రీ చంద్రశేఖర్, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
—————————————————————————-
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.